ప్రేమ వ్యవహారంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబ్‌నగర్ జిల్లా మండలం ప్రశాంత్ నగర్‌లో విషాదం నింపింది. ప్రశాంత్‌నగర్ గ్రామానికి చెందిన కళమ్మ అనే మహిళ భర్త చాలా ఏళ్ల క్రితమే చనిపోయాడు. దీంతో ముగ్గురు కూతుళ్లను ఆమే పెంచి పెద్దచేసింది. పెద్ద కుమార్తెకు వివాహం కాగా మిగిలిన ఇద్దరు కూతుళ్లతో కళమ్మ కలిసి జీవిస్తోంది. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం ఇంటి నుంచి బయటికి వెళ్లిన రెండో కుమార్తె సుమలత (32) ఎంతకూ తిరిగి రాలేదు. ఆమె కోసం తల్లి, చెల్లి గాలించగా పాత ఇంట్లోని దూలానికి ఉరేసుకుని కనిపించింది. Also Read: దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై పోచయ్య సిబ్బందితో కలిసి ప్రశాంత్‌నగర్ గ్రామానికి వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అమ్రాబాద్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. తన కూతురు ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని సుమలత తల్లి కళమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు, సుమతల మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారని, ఎన్నిసార్లు పెళ్లి ప్రస్తావన తెచ్చినా అతడు దాటవేస్తుండటంతోనే మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదు పేర్కొంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3dOMV7i
0 Comments