వాళ్లద్దరు నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వారి వ్యవహారం యువతి తల్లికి, అన్నకు ఇష్టం లేదు. యువతి మైనర్ కావడంతో పెద్దల మధ్య అనేకసార్ల పంచాయతీ జరిగింది. తమకు పెళ్లి చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని ప్రేమజంట ఎన్నోసార్లు పెద్దలను హెచ్చరించింది. ఇటీవలే అమ్మాయికి మైనార్టీ తీరడంతో వివాహ బంధంతో ఒక్కటి కావాలనుకున్నారు. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడానికి ఇద్దరూ కలిసి కారులో బయలుదేరారు. ఈ విషయం తెలుసుకున్న యువతి అన్న కారును అడ్డగించి ప్రియుడిని టెలిఫోన్ స్తంభానికి కట్టేసి చిత్రహింసలు పెట్టాడు. సినీఫక్కీలో జరిగిన ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా మండలంలో కలకలం రేపింది. Also Read: నరసాపురం మండలం సీతారామపురం పంచాయతీ పరిధిలోని వెంకట్రావుతోటకు చెందిన నేతల విలియం రాజు నరసాపురంలోని ఓ కాలేజీలో ఎంసీఏ చదువుతున్నాడు. అదే ప్రాంతానికి చెందిన నల్లి లావణ్య మణి, విలియం రాజు నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన వీరిద్దరూ కుటుంబ పెద్దలకు చెప్పి పెళ్లి చేయాలని కోరారు. లావణ్య మణికి తండ్రి లేడు. తల్లి, అన్నయ్య సంతోష్, తమ్ముడు జాన్ ఉన్నారు. ఈ పెళ్లి తమకు ఇష్టం లేదని లావణ్య తల్లి, అన్నయ్య తెగేసి చెప్పారు. దీంతో పాలకొల్లు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్లి చేసుకునేందుకు గురువారం ఏర్పాట్లు చేసుకున్నారు. Also Read: విలియంరాజు, లావణ్యమణి, ఆమె తమ్ముడు జాన్ ముగ్గురు కలిసి కారులో రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్తుండగా దిగమర్రు వద్ద సంతోష్ వారిని కారును బైక్‌తో అడ్డగించాడు. కారులో నుంచి విలియం రాజును బయటకు లాగి పిడిగుద్దులు కురిపించాడు. అక్కడే ఉన్న స్తంభానికి కట్టేసి చిత్రహింసలు పెట్టాడు. బాధితుడి కేకలు విన్న స్థానికులు వెంటనే పాలకొల్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ అప్పారావు తన సిబ్బందితో వెంటనే అక్కడికి చేరుకుని విలియంరాజును విడిపించి ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదుతో సంతోష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో లావణ్య తమ్ముడు జాన్ కూడా గాయపడ్డాడు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2YvaV9h
0 Comments