పెళ్లి పేరుతో మహిళా కానిస్టేబుల్‌తో అఫైర్.. గుట్టుగా మరొకరికి తాళి కట్టి

ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతాయుత ఉద్యోగంలో ఉన్న పోలీసే కామాంధుడిగా మారాడు. తనతో పాటు పనిచేసే మహిళా కానిస్టేబుల్‌ని ప్రేమ, పెళ్లి పేరుతో లొంగదీసుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగింది. వెల్టూరులో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కానిస్టేబుల్ అక్కడే కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంట పడేవాడు. 2015 నుంచి ఆమెతో ప్రేమాయణం నడుపుతూ అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. Also Read: ఇటీవల గుట్టుచప్పుడు కాకుండా మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు నిలదీయగా నీ దిక్కున్న చోట చెప్పుకోమంటూ బెదిరించాడు. దీంతో ఆ మహిళా కానిస్టేబుల్ నాగపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు శాఖాపరంగానూ విచారణ చేస్తున్నారు. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3fGTcCU

Post a Comment

0 Comments