శివారులో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని ఓయో లాడ్జిలో ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటనలో యువతి అక్కడికక్కడే చనిపోయగా.. ప్రియుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. శ్రావణి, అజయ్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. మంగళవారం వారు మేడిపల్లిలోని ఓయో లాడ్జిలో రూమ్ తీసుకున్నారు. బుధవారం ఉదయం వారు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది మారుతాళంతో గది తలుపులు తెరవగా ఇద్దరూ మంచంపై పడి ఉన్నారు. Also Read: దీంతో లాడ్జి సిబ్బంది వెంటనే మేడిపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా శ్రావణి అప్పటికే చనిపోయింది. కొన ఊపిరితో ఉన్న అజయ్ని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే ఇద్దరూ ఆత్మహత్యకు యత్నించారా? లేక అజయ్ ప్రియురాలిని చంపి తాను పురుగులమందు తాగాడా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ జంట ఓయో లాడ్జిలోకి వెళ్లిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. అజయ్ కోలుకుంటేనే గదిలో ఏం జరిగిందన్న దానిపై స్పష్టత వస్తుందని పోలీసులు చెబుతున్నారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3ewHGJd
0 Comments