Pak: కొంప ముంచిన పొగమంచు.. 13 మంది సజీవదహనం

పాకిస్థాన్‌లో ఘోర చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న ప్యాసింజర్ వ్యాన్, బస్సు పరస్పరం ఢీకొన్నాయి. ప్రమాదం అనంతరం మంటలు చెలరేగి ఇరు వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో 13 మంది అగ్నికి ఆహుతయ్యారు. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. పంజాబ్‌ ప్రావిన్స్‌లోని షేకుపురాలో సోమవారం (నవంబర్ 30) ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పొగమంచు కారణంగా దారి కనబడకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో వ్యాన్‌ పూర్తిగా దగ్ధమైందని తెలిపారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని హాస్పిటళ్లకు తరలించినట్లు చెప్పారు. వారిలో 80 శాతానికి పైగా కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఈ ఘటనపై పంజాబ్‌ ప్రావిన్స్‌ ముఖ్యమంత్రి ఉస్మాన్‌ బజ్దార్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదం జరిగిన ప్రాంతం లాహోర్‌కు 75 కి.మీ. దూరంలో ఉంది. Also Read: Must Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/36rG42J

Post a Comment

0 Comments