కాాన్పూర్‌లో కలకలం.. ఒకేచోట బయటపడ్డ నాలుగు మానవ అస్థిపంజరాలు

ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగు మానవ అస్థిపంజరాలు బయటపడిన ఘటన ఉత్తర్‌‌ ప్రదేశ్‌లో సోమవారం వెలుగుచూసింది. కాన్పూర్ నగరం పంకీ పోలీస్ స్టేషన్ పరిధిలో వీటిని పోలీసులు గుర్తించారు. కశ్మీర్ కాలనీలో ఈ అస్థిపంజరాలు బయటపడ్డాయి. దీంతో ఆ కాలనీలో కలకలం రేగింది. నాలుగు అస్థిపంజరాలు బయటపడటంతో ఆ కాలనీ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. నాలుగు అస్థి పంజరాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు దీనిపై కేసు నమోదుచేసిన దర్యాప్తు ప్రారంభించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కాన్పూర్ జిల్లా ఎస్పీ అనిల్ కుమార్ తెలిపారు. అనుమానాస్పద కేసుగా నమోదుచేసినట్టు వివరించారు. ఈ నలుగురిని ఎవరైనా హత్యచేశారా? లేదా ఆత్మహత్యకు పాల్పడ్డారా? అనే కోణంలో దర్యాప్తు సాగుతోందని ఎస్పీ పేర్కొన్నారు. ఈ అస్థిపంజరాలు చాలా రోజులు కిందట చనిపోయిన వ్యక్తులవని, వీరంతా పెద్దవాళ్లేనని పోలీసులు చెప్పారు. స్వాధీనం చేసుకున్న అస్థిపంజరాలను శవపరీక్షల కోసం తరలించినట్టు తెలిపారు. దర్యాప్తు తర్వాత పూర్తి వివరాలు వెళ్లడిస్తామని ఎస్పీ అనిల్ కుమార్ అన్నారు. ఆ కాలనీకి చెందిన వ్యక్తులేనా? ఎవరైనా ఇక్కడ పడేశారా? అనేది దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ వివరించారు. దీని వెనుక మిస్టరీ తేల్చడానికి ప్రత్యేకంగా పోలీస్ టీంను ఏర్పాటుచేశారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/33P62LC

Post a Comment

0 Comments