బురఖా వేసుకోబోయి దొరికిపోయిన దంపతులు.. గుంటూరులో షాకింగ్ ఘటన

ప్రియురాలి మోజులో కొడుకు భార్యకు విడాకులిచ్చాడని.. లక్షలు తగలేశాడని పేరెంట్స్ పగ పెంచుకున్నారు. తమ బిడ్డ జీవితం నాశనం కావడానికి ప్రియురాలే కారణమని ఆగ్రహంతో రగిలిపోయారు. ఎలాగైనా ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకుని ఆమె ఇంటి వద్దకు చేరారు. అయితే నగరంలో అడ్రస్ సరిగ్గా తెలియక అనుమానాస్పదంగా తిరిగారు. బురఖా వేసుకుని ఉన్న తల్లి ఓ బాలుడిని దగ్గరికి పిలవడంతో అతను భయపడి వెళ్లలేదు. ఈలోగా తండ్రి కూడా పక్కకు వెళ్లి బురఖా ధరించబోయి స్థానికులకు అడ్డంగా దొరికిపోయాడు. పిల్లలను పట్టుకెళ్లేందుకు వచ్చిన గ్యాంగ్ అనుకుని చితకబాదారు. అప్పటికే అక్కడ పిల్లలను పట్టుకెళ్లే గ్యాంగ్‌లు తిరుగుతున్నాయని ప్రచారం ఉండడంతో స్థానికులు తీవ్రంగా స్పందించారు. రంగంలోకి దిగిన పోలీసులు దంపతులను స్టేషన్‌కి తీసుకెళ్లి విచారించడంతో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. మహిళను హత్య చేసేందుకు వచ్చారని తెలిసి పోలీసులు అప్రమత్తమయ్యారు. కొడుకుని, అతని ప్రియురాలిని పిలిపించి వివరాలు తెలుసుకున్నారు. ఈ షాకింగ్ ఘటన గుంటూరులో బుధవారం కలకలం రేపింది.

బురఖాలో ఉన్న మహిళ బాలుడిని పిలిచి అడ్రస్ అడిగింది. అక్కడే అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. పిల్లలు పట్టుకెళ్లే గ్యాంగ్ అనుకుని దంపతులకు దేహశుద్ధి చేశారు. కానీ చివరికి షాకింగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది.

బురఖా వేసుకోబోయి దొరికిపోయిన దంపతులు.. గుంటూరులో షాకింగ్ ఘటన

ప్రియురాలి మోజులో కొడుకు భార్యకు విడాకులిచ్చాడని.. లక్షలు తగలేశాడని పేరెంట్స్ పగ పెంచుకున్నారు. తమ బిడ్డ జీవితం నాశనం కావడానికి ప్రియురాలే కారణమని ఆగ్రహంతో రగిలిపోయారు. ఎలాగైనా ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకుని ఆమె ఇంటి వద్దకు చేరారు. అయితే నగరంలో అడ్రస్ సరిగ్గా తెలియక అనుమానాస్పదంగా తిరిగారు. బురఖా వేసుకుని ఉన్న తల్లి ఓ బాలుడిని దగ్గరికి పిలవడంతో అతను భయపడి వెళ్లలేదు. ఈలోగా తండ్రి కూడా పక్కకు వెళ్లి బురఖా ధరించబోయి స్థానికులకు అడ్డంగా దొరికిపోయాడు. పిల్లలను పట్టుకెళ్లేందుకు వచ్చిన గ్యాంగ్ అనుకుని చితకబాదారు. అప్పటికే అక్కడ పిల్లలను పట్టుకెళ్లే గ్యాంగ్‌లు తిరుగుతున్నాయని ప్రచారం ఉండడంతో స్థానికులు తీవ్రంగా స్పందించారు. రంగంలోకి దిగిన పోలీసులు దంపతులను స్టేషన్‌కి తీసుకెళ్లి విచారించడంతో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. మహిళను హత్య చేసేందుకు వచ్చారని తెలిసి పోలీసులు అప్రమత్తమయ్యారు. కొడుకుని, అతని ప్రియురాలిని పిలిపించి వివరాలు తెలుసుకున్నారు. ఈ షాకింగ్ ఘటన గుంటూరులో బుధవారం కలకలం రేపింది.

​వివాహేతర సంబంధం..
​వివాహేతర సంబంధం..

మాచర్ల పట్టణంలోని నూర్‌ మసీదు ప్రాంతానికి చెందిన హుస్సేన్, నాగూర్‌బీ దంపతులు. వారికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు సంతానం. పెద్ద కొడుకు జిలానీకి 8 ఏళ్ల కిందట వివాహమైంది. కొద్దికాలంగా జిలానీ అదే ప్రాంతానికి చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ విషయం ఇంట్లో తెలిసిపోవడంతో గొడవలు జరిగాయి. ఏడాది కిందట జిలానీ భార్య విడాకులు తీసుకుని వెళ్లిపోయింది. అనంతరం ప్రియురాలు కూడా మాచర్ల నుంచి గుంటూరుకు మకాం మార్చింది. అయినా జిలానీతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నట్లు అతని తండ్రి హుస్సేన్‌కి తెలిసింది.

​ప్రియురాలే కారణమని కోపం..
​ప్రియురాలే కారణమని కోపం..

కోడలు విడాకులిచ్చి వెళ్లిపోవడం.. తన కొడుకు జీవితం నాశనం కావడానికి అతని ప్రియురాలే కారణమని కోపం పెంచుకున్నారు హుస్సేన్ నాగూర్‌బీ దంపతులు. కొడుకు వద్ద నుంచి లక్షల రూపాయలు కాజేసిందని కక్షగట్టారు. ఆమెను ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకున్నారు. మాచర్లలో బస్సెక్కి గుంటూరు చేరారు. ఆమె గుజ్జనగుండ్ల ప్రాంతంలో నివాసముంటోందని తెలుసుకుని అక్కడిదాకా వచ్చారు. అయితే నగరంలో ఆమె అడ్రస్ కనుక్కోవడం కష్టమైంది. ఇంటి అడ్రస్ సరిగ్గా తెలియకపోవడంతో అటూఇటూ అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు.

Also Read: బైక్‌పై నుంచి పడిన యువతి, హెయిర్ క్లిప్ గుచ్చుకుని.. తిరుపతిలో షాకింగ్ ఘటన

​బురఖా వేసుకోబోయిన తండ్రి..
​బురఖా వేసుకోబోయిన తండ్రి..

బురఖాలో ఉన్న నాగూర్‌బీ అడ్రస్ అడిగేందుకు ఒక బాలుడిని పిలిచింది. అప్పటికే అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో అతను భయంతో దగ్గరకు వెళ్లలేదు. ఈలోగా హుస్సేన్ కూడా ఎవరూ గుర్తుపట్టకుండా ఉండాలనే ఉద్దేశంతో పక్కకు వెళ్లి బురఖా వేసుకోబోయాడు. మగమనిషి బురఖా వేసుకోవడం గమనించిన పారిశుధ్య కార్మికురాలు గమనించి స్థానికులను అప్రమత్తం చేసింది. వెంటనే ఇద్దరినీ నిర్బంధించి వారి వద్దనున్న సంచి లాక్కుని చూడడంతో అందులో కత్తి, కారం ఉండడంతో షాక్‌కి గురయ్యారు. అప్పటికే పిల్లలను పట్టుకెళ్లే గ్యాంగ్‌లు తిరుగుతున్నాయంటూ ప్రచారం జరుగుతుండడంతో స్థానికులు ఘాటుగా స్పందించారు. పిల్లలను కిడ్నాప్ చేసేందుకు వచ్చారనుకుని చితకబాదారు.

​ఖాకీల ఎంట్రీతో షాకింగ్ ట్విస్ట్
​ఖాకీల ఎంట్రీతో షాకింగ్ ట్విస్ట్

పిల్లలను ఎత్తుకెళ్లే గ్యాంగ్‌ని స్ధానికులు పట్టుకున్నారని సమాచారం రావడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికుల నుంచి వారిని విడిపించి పోలీస్ స్టేషన్‌కి తరలించారు. దంపతులను పోలీసులు ఆరా తీయడంతో షాకింగ్ విషయాలు వెల్లడించారు. తమ కొడుకు ప్రియురాలిని హతమార్చేందుకు వచ్చామని.. అడ్రస్ తెలియక తిరుగుతున్నట్లు చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. వెంటనే అప్రమత్తమై వారి కొడుకుని, అతని ప్రియురాలిని స్టేషన్‌కి పిలిపించి ప్రశ్నించడంతో నిజమేనని తేలింది. దంపతులపై సంబంధింత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

Read Also: యువతి ఆత్మహత్య.. ఆమె ఫోన్‌లో షాకింగ్ వీడియో.. చివరికి..

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2Ke9acQ

Post a Comment

0 Comments