మలేషియాలో కొత్తరకం కరోనా.. కుక్కల నుంచి మనుషులకు!

ఏడాదిన్నర నుంచి ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న .. సార్స్-కోవి-02 రకానికి చెందినది. ఈ వైరస్‌లో పలు రకాలున్న విషయం తెలిసిందే. తాజాగా, మలేషియాలో కొత్త రకం కరోనా వైరస్‌‌ను గుర్తించారు. ఈ వైరస్ కుక్కుల నుంచి వచ్చినట్టు భావిస్తున్నారు. 2017-18లో న్యుమోనియాతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన రోగుల్లో కొత్త రకం కరోనా వైరస్‌ను గుర్తించినట్టు పరిశోధకులు తెలిపారు. తాజాగా ఈ పరిశోధన పత్రాలను క్లినికల్‌ ఇన్ఫెక్టియస్‌ డిసీజస్‌ జర్నల్‌లో ప్రచురించారు. ఈ వైరస్‌ వ్యాధికారకమని గుర్తిస్తే జంతువుల నుంచి మనుషులకు సోకే ఎనిమిదో వైరస్‌ అవుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. మలేసియాలోని సార్వాక్‌ చెందిన ఓ ఆస్పత్రిలో 301 రోగుల నమూనాలను పరీక్షించగా ఐదేళ్ల కంటే తక్కువ వయసున్న 8 మంది పిల్లల్లో కానైన్‌ కరోనా గుర్తించామని వెల్లడించారు. జన్యు పరీక్షలు నిర్వహించగా.. అనే రకం కరోనా వైరస్‌ సాధారణంగా పిల్లులు, పందులకు వ్యాపిస్తుందని నిర్దారణ అయ్యింది. కొన్ని సందర్భాల్లో కుక్కలు కూడా దీని బారిన పడతాయని పేర్కొన్నారు. మానవుల్లో ఉండే కరోనా వైరస్‌ సార్స్‌-కోవ్‌-2 మ్యుటేషన్లు జంతువుల్లో వేరుగా ఉంటాయని తెలిపారు. అయితే, తాజా వైరస్‌ జంతువుల నుంచి మానవులకు సంక్రమించే సూచనలు కనిపించాయని పరిశోధకులు తెలిపారు. ఇది ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందుతుందో లేదో తెలుసుకొనేందుకు మరిన్ని అధ్యయనాలు అవసరమని ఉద్ఘాటించారు. ఇప్పటి వరకు మానవుల్లో వ్యాధికి కారక వైరస్‌లు ఏడు ఉన్నాయి. వాటిలో నాలుగు జలుబుకు కారణమవుతాయి. మరో మూడు సార్స్‌, మెర్స్‌, కొవిడ్‌-19కు కారణమవుతాయని పరిశోధనల్లో వెల్లడయ్యింది.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3hL0v0z

Post a Comment

0 Comments