ముంబయి: భారీ వర్షాలకు విరిగిపడ్డ కొండచరియలు.. 11 మంది మృతి

మహారాష్ట్రలో పెను విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి 11 మంది మృతిచెందారు. ముంబయి సమీపంలోని చెంబుర్, విఖ్రోలి ప్రాంతాల్లో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షాలు కొండచరియలు విరిగిపడ్డాయి. ఇవి ఇళ్లపై పడటంతో 11 మంది మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. చెంబుర్‌లోని భరత్ నగర్ ప్రాంతంలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి ఇళ్ల పైకప్పులపై పడ్డాయి. ఈ శిథిలాల నుంచి 15 మందిని వెలికితీశారు. విఖ్రోలిలోని సూర్య నగర్‌లో తొమ్మిది మందిని రక్షించినట్టు అధికారులు తెలిపారు. గాయపడినవారికి చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రులకు తరలించినట్టు అధికారులు పేర్కొన్నారు. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని ఆయన వివరించారు. శిథిలాల కింద మరి కొందరు చిక్కుకున్నారు. ఇప్పటి వరకూ భరత్ నగర్‌లో ఎనిమిది మంది, విఖ్రోలిలో ముగ్గురు చనిపోయారు.మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు, ముంబయిలోని దాదర్, గాంధీ మార్కెట్, చునాభట్టీ, సియోన్, చెంబుర్, కుర్లా సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3ewUxxH

Post a Comment

0 Comments