
తన లైంగిక కోరిక తీర్చలేదన్న కోపంతో ఓ వ్యక్తి వివాహితపై యాసిడ్ దాడికి పాల్పడిన ఘటన జిల్లా మండలంలో చోటుచేసుకుంది. త్రిపురాంతకం మండలం జి.ఉమ్మడివరానికి చెందిన వివాహిత(33) ఈ నెల 6వ తేదీన కూలి పని కోసం గుంటూరు జిల్లా వినుకొండ మండలం తంగిరాలమెట్టకు వెళ్లింది. ఆమెపై కన్నేసిన దండిబోయిన ఆంజనేయులు అనే వ్యక్తి కోరిక తీర్చాలంటూ ఆమెను వేధించాడు. ఆమె ఎదురుతిరగడంతో శరీరంపై యాసిడ్ పోశాడు. తీవ్రగాయాల పాలైన ఆమెను కుటుంబసభ్యులు గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. Also Read: బాధితురాలికి 40శాతానికి పైగా శరీరం కాలిపోవడంతో డాక్టర్లు చేతి, కాలి వేళ్లను తొలగించారు. మంగళవారం ఓ సర్జరీ చేయడంతో బాధితురాలు కోలుకుంటోందని డాక్టర్లు చెప్పారు. అయితే ఈ ఘటనపై బాధితురాలి సోదరుడు ఈ నెల 24వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. అతడు తొలుత త్రిపురాంతకం, ఆ తర్వాత వినుకొండ పోలీసుస్టేషన్లకు వచ్చి జరిగిన ఘటనపై వేర్వేరుగా ఫిర్యాదు ఇచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. ఘటన త్రిపురాంతకం, వినుకొండ సరిహద్దు మధ్యలో జరగడంతో అది ఎవరి పరిధిలోకి వస్తుందో తెలియక రెండు జిల్లాల పోలీసులు కేసు నమోదు విషయమై స్పష్టత రాలేకపోతున్నారు. Also Read: మరోవైపు ఈ ఘటనపై పోలీసులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బాధితులు ఇంత ఆలస్యంగా ఎందుకు ఫిర్యాదు చేశారన్నది మిస్టరీగా మారింది. అసలు ఆమెపై యాసిడ్ దాడి జరిగిందా? ఇంకా వేరేదైనానా? అని అనుమానిస్తున్నారు. డాక్టర్లు ఇచ్చే నివేదికను బట్టి దీనిపై ముందుకు వెళ్లాలని యోచిస్తున్నారు. బాధితురాలి వాంగ్మూలం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వినుకొండ సీఐ చిన్నమల్లయ్య తెలిపారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2rxf8MY
No comments:
Post a Comment