Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Monday, 24 February 2020

గుంటూరులో కీచక మామ... కోరిక తీర్చాలంటూ కోడలికి వేధింపులు

జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఎన్నో ఆశలతో అత్తింట్లో అడుగుపెట్టిన కోడలిని కోరిక తీర్చాలంటూ మామ వేధింపులకు గురిచేస్తున్నాడు. తన కొడుకుతో కాపురం నిలబడాలంటే తనను కూడా సుఖపెట్టాలని ఒత్తిడి తెస్తున్నాడు. ఈ విషయాన్ని అత్తగారికి చెబితే పెద్దోళ్ల ఇళ్లల్లో ఇలాంటివన్నీ కామన్ అంటూ భర్తకే మద్దతు పలికింది. దీంతో ఏం చేయాలని పాలుపోని స్థితిలో బాధితురాలు చివరికి పోలీసులను ఆశ్రయించింది. సోమవారం గుంటూరు అర్బన్ ఏఎస్పీ గంగాధరం ఆధ్వర్యంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో తనగోడు వెళ్లబోసుకుంది. దీంతో స్పందించిన ఏఎస్పీ ఆమె ఫిర్యాదుపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. Also Read: బాధితురాలి కథనం ప్రకారం.. ‘ఎంబీఏ చదువుకున్న నాకు గుంటూరు నగరానికి చెందిన ఓ పారి కొడుకువివాహం చేశారు. కట్నంగా రూ. 40 లక్షలు, కిలో బంగారం, కారు, ఇంటి సామగ్రికి మరో రూ. 20 లక్షలు ఇచ్చారు. భర్త వ్యాపార పనుల నిమిత్తం తరుచూ ఇతర ప్రాంతాలకు వెళ్తుంటాడు. పెళ్లయిన కొద్దిరోజులకే రాత్రి సమయంలో మామగారు వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడు. అత్తకు చెబితే ఇవన్నీ ఉన్నత కుటుంబాల్లో సహజమేనంటూ చెప్పడంతో నిర్ఘాంతపోయా. ఈ విషయాన్ని పుట్టింటి వాళ్లకు చెబితే వచ్చి మాట్లాడారు. తాను అలాంటి పనిచేయలేదని మామగారు ప్లేటు ఫిరాయించారు. Also Read: ఈ క్రమంలోనే గర్భం దాల్చి ఆడపిల్లకు జన్మనిచ్చాను. కొద్ది రోజుల తర్వాత నా భర్త టూర్‌కు వెళ్లిన రోజు రాత్రివేళ మామయ్య నా గదిలోకి వచ్చి తన కోరిక తీర్చకపోతే కాపురం నాశనం చేస్తానంటూ బెదిరించాడు. దీంతో భయపడి పాపతో సహ బయటకు వచ్చేశాను. అత్తకు చెపితే ఆమె తన భర్తకే వత్తాసు పలికింది. అదేంటని నిలదీస్తే నీ భర్త టూర్లకు వెళ్లి అక్కడ ఎంజాయ్‌ చేయడం లేదా అంటూ ప్రశ్నించింది. ఈ విషయాన్ని భర్తకు చెపితే నన్ను కొట్టి పుట్టింటికి గెంటేశాడు. ఈ విషయంపై పుట్టింటి వాళ్లు నిలదీస్తే ఆడపిల్లల పుట్టింది కాబట్టి రూ. కోటి అదనపు కట్నం ఇవ్వాలని, లేకపోతే తమ కుమారుడికి మరో పెళ్లి చేస్తామంటూ బెదిరించారు. అంతేకాకుండా మామ అసభ్యకరంగా ప్రవర్తించిన విషయాలు బయటపెడితే నన్ను, నా కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరిస్తున్నారు.’ అంటూ బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2HR1qt1

No comments:

Post a Comment