
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి క్రమశిక్షణ కలిగిన పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడే కీచకుడిగా మారిపోయాడు. అభం శుభం తెలియని చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో బాలికలు ఇంట్లో చెప్పలేక..అటు పాఠశాలకు వెళ్లలేక సతమతమవుతున్నారు. చివరికి తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. జిల్లాలో వెలుగుచూసిన ఘటన వివరాలిలా ఉన్నాయి. Also Read: రాజుపాలెం మండలం ఆకులగణపవరంలోని మండల పరిషత్ పాఠశాలలో హెచ్‌ఎంగా పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు ఐదో తరగతి చదివే విద్యార్థినుల పట్ల కొంతకాలంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. వారికి సెల్‌ఫోన్లో పోర్న్ వీడియోలు చూపించడం, బాలికల శరీరంపై తాకడం, అసభ్యంగా మాట్లాడటం చేస్తున్నాడు. అతడి వికృత చేష్టలకు బాలికలు స్కూల్‌కి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. Also Read: ఇటీవల ఓ బాలిక పాఠశాలకు వెళ్లకుండా కొద్ది రోజులుగా ఇంట్లోనే ఉండటంతో తల్లిదండ్రులు ప్రశ్నించినా నోరు మెదపలేదు. చివరికి తల్లి దగ్గరికి తీసుకుని ఏం జరిగిందని ఆరా తీయగా అసలు విషయం చెప్పింది. ఈ విషయం స్థానికంగా ప్రచారం కావడంతో ఆ స్కూల్‌లో చదివే బాలికల తల్లిదండ్రులు తమ కుమార్తెలను ఆరా తీశారు. అందరూ ఆ ఉపాధ్యాయులు చేసే చేష్టలను వివరించడంతో అందరూ కలిసి సోమవారం స్కూల్‌కి వెళ్లి అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు పట్టించారు. Also Read: అయితే ఈ వ్యవహారంలో పోలీసులు నిందితుడికి అనుకూలంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. తల్లిదండ్రులు స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్న సమయంలో నిందితుడి సామాజిక వర్గానికి చెందిన కొందరు నేతలు అక్కడికి వచ్చారు. బాలిక తల్లిదండ్రులు వెనుకబడిన వర్గానికి చెందిన వారు కావడంతో వారిపై ఒత్తిడి తీసుకువచ్చి రాజీ కుదిర్చి ఫిర్యాదు చేయకుండానే వెనక్కి పంపారు. కొందరు ఈ విషయాన్ని డీఈవో గంగాభవానికి చేరవేయగా ఆమె విచారణ చేపట్టారు. నిందితుడిపై ఆరోపణలు నిజమేనని తేలడంతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/37YnyMA
No comments:
Post a Comment