Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Tuesday, 22 December 2020

జాతీయ రైతు దినోత్సవం.. అన్నదాాత కోసం ఆ మహనీయుడి పోరాటానికి ప్రతిఫలం ఏదీ?

జాతీయ రైతు దినోత్సవాన్ని ఏటా డిసెంబర్ 23న దేశవ్యాప్తంగా జరుపుకుంటాం. దేశానికి రైతు వెన్నుముక. రైతు లేనిదే ఈరోజు మనిషి లేడు.. అన్నదాత అహర్నిశలు కష్టించి చోమటోడ్చితే తప్ప దేశానికి అన్నం ఉండదు. ఈరోజున కడుపు నిండా అన్నం తింటున్నామంటే అది రైతు చలువే. అలాంటి రైతు ఆరుగాలం శ్రమించి పంటి పండించినా అది చేతికి అందుతుందనే నమ్మకం లేదు. అయినా సరే రైతులు మాత్రం కుంగిపోకుండా ఈ ఏడు కాకపోతే వచ్చే ఏడాది ప్రకృతి కరుణించకపోతుందా, పంట చేతికందకపోతుందా అనే ఆశావాదంతో జీవనం సాగిస్తున్నారు. ఓవైపు అతివృష్టి, మరోవైపు అనావృష్టి అనునిత్యం వెంటాడుతూనే ఉన్నాయి. అన్నదాతల జీవితాలకు భరోసా లేని పరిస్థితి. ఒకవేళ ప్రకృతి కరుణించి దిగుబడి బాగున్నా పండిన పంటకు సరైన ధరలేక నిస్సాహయుడిగా మిగిలిపోయే పరిస్థితి. దేశాన్ని రక్షించే జవాన్‌లకు ఎంత ప్రాముఖ్యత ఉందో అన్నం పెట్టే రైతన్నకు అంతే ప్రాముఖ్యత ఉంది. అందుకే జై జవాన్‌... జై కిసాన్‌ అనే నినాదం యావత్‌ భారత దేశంలో వినిపిస్తుంది. భారత మాజీ ప్రధాని చరణ్‌సింగ్‌ జన్మదినమైన డిసెంబరు 23న రైతు దినోత్సవం జరుపుకుంటారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయం ఒక జూదంగా మారింది. ఒక రోజు వర్షాల కోసం.. ఇంకోరోజు విత్తనాల కోసం.. మరో రోజు ఎరువుల కోసం.. బ్యాంకు రుణాల కోసం ఇలా ప్రతి విషయంలోనూ ఒత్తిళ్లకు గురి కావాల్సిన పరిస్థితి రైతులకు ఏర్పడుతోంది. భారత ఐదో ప్రధాని చౌదరి చరణ్ సింగ్ చేసిన పలు ఉద్యమాల ఫలితంగా జమీందారీ చట్టం రద్దయి కౌలుదారీ చట్టం అమలులోకి వచ్చింది. రైతులకు బ్యాంకు ఋణాలు అందించే విధానం ప్రవేశపెట్టారు. రైతుల గురించి, వ్యవసాయ రంగం గురించి అంతగా ఆలోచించి, వారి సమస్యల పరిష్కారానికి చరణ్ సింగ్ కృషి చేశారు. దీంతో చరణ్ సింగ్ రైతు బంధుగా గుర్తింపు తెచ్చుకున్నారు. పార్ల‌మెంట్‌ని ఎదుర్కొలేక‌పోయి తాత్కాలిక ప్ర‌ధానిగానే 1980లోనే ఆయన ప‌ద‌వి నుంచి త‌ప్పుకోవాల్సి వ‌చ్చింది. చ‌ర‌ణ్ సింగ్ రైతు నాయ‌కుడిగానే 1987 మే 29న కన్నుమూశారు. రైతు కుటుంబం నుంచి వ‌చ్చిన చ‌ర‌ణ్ సింగ్‌ .. రైతుల‌కు చేసిన సేవ‌ల‌కు గుర్తుగా ఆయ‌న జ‌న్మ‌దినం డిసెంబ‌ర్ 23న కిసాన్ దివ‌స్ జాతీయ రైతు దినోత్స‌వంగా భార‌త దేశంలో జ‌రుపుకొంటారు. చరణ్ సింగ్ సమాధిని కిసాన్ ఘాట్ అని పిలుస్తారు. అ ‘రైతు రాజు కాడు... దున్నేవాడిది భూమి కాదు.. వర్షం రాదు, కరువు పోదు.. కష్టం తరగదు, నష్టం తీరదు.. అప్పులు, పేదరికం.. నిరాశ, నిస్సహాయం.. కన్నీళ్ల తడి ఆరదు.. కానీ ఆశ చావదు.. తాను నమ్ముకున్న మట్టి మోసం చేయదని, శరీరాన్ని తాకట్టుపెట్టి, మనసుని బందీ చేసి, ఆత్మని పొలంలోనే పాతిపెట్టే రైతన్న’ఈ రోజున వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేసే దుస్థితి నెలకుంది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరరేకంగా దాదాపు నెల రోజుల నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఎముకల కొరికే చలిని సైతం లెక్కచేయక అన్నదాతలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/37IeSNB

No comments:

Post a Comment