Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Saturday, 27 March 2021

మాయన్మార్‌ దమనకాండ.. సైన్యం కాల్పుల్లో నిన్న ఒక్క రోజే 50 మంది మృతి

దాదాపు రెండు నెలలుగా మాయన్మార్‌లో సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తుతున్న ప్రజలపై సైన్యం అణచివేత ధోరణి కొనసాగుతోంది. ఆందోళనకారులపై సైన్యం జరిపిన కాల్పుల్లో ఇప్పటివరకు 300 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి న్యాయవాదులు, మీడియా విడుదల చేసిన నివేదికలో తేలింది. తుపాకీతో కాల్చడం వల్లే 90 శాతం మంది చనిపోయారని వివరించింది. ఒక్క శనివారమే 50 మందికిపైగా ఆందోళనకారులు సైన్యం తూటాలకు బలయ్యారు. ‘ఈ రోజు సైనిక దళాలు సిగ్గుపడే రోజు’ అంటూ ప్రజాస్వామ్య కూటమి అధికార ప్రతినిధి డాక్టర్ షాసా దుయ్యబట్టారు. అత్యంత దారుణంగా వ్యవహరిస్తోన్న సైనిక ప్రభుత్వం.. తన చర్యలను సమర్ధించుకుంటోంది. ప్రజాస్వామ్యాన్ని రక్షించి, ప్రజలను కాపాడటానికే ప్రయత్నిస్తున్నామని సైనిక ప్రభుత్వాధినేత జుంటా ప్రకటించాడు. ఫిబ్రవరి 1న సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా మాయన్మార్‌లోని ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు. సైన్యం హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఆందోళనలు నిర్వహించారు. అమాయకులైన 300 మందికిపైగా పౌరులను పొట్టనబెట్టుకున్న తర్వాత ఆర్మీ జనరల్స్ సాయుధ దళాల దినోత్సవం జరుపుకుంటున్నారని మండిపడ్డారు. నిరసనలు ప్రారంభమైనప్పటి నుంచి సైన్యం కాల్పుల్లో 320 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. శనివారం ఉదయం యంగూన్ దలాల్ ప్రాంతంలో శనివారం ఉదయం సైన్యం జరిపిన కాల్పుల్లో కనీసం నలుగురు చనిపోగా.. పది మందికిపైగా గాయపడ్డారు. ఇన్‌సైన్ జిల్లాలో 21 ఏళ్ల ఫుట్‌బాల్ క్రీడాకారుడు సహా ముగ్గురు, మండాలేలోని వివిధ ప్రాంతాల్లో 13 మంది మృతిచెందారు. ఒక్క శనివారమే కనీసం 50 మంది చనిపోయినట్టు మీడియా నివేదికలు వెల్లడించాయి. దీనిపై సైన్యం అధికార ప్రతినిధి స్పందించడానికి నిరాకరించారు. ఇక, మాయన్మార్ రాజధాని నైపిటాలో సాయుధ దళాలు దినోత్సవం సందర్భంగా సైనిక కవాతు నిర్వహించారు. ఇందులో పాల్గొన్న సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హ్లైంగ్ మాట్లాడుతూ.. దేశంలో ఎన్నికలను నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. అయితే, ఎప్పడనేది మాత్రం స్పష్టతనివ్వలేదు. సహా పలువురి ప్రజా ప్రతినిధుల నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ దాదాపు రెండు నెలలుగా జరుగుతున్న ఆందోళనల్లో గురువారం వరకు 380 మంది చనిపోయినట్టు హక్కుల సంఘాల నివేదికలు చెబుతున్నాయి. అసిస్టెంట్ అసోసియేషన్ ఫర్ పొలిటికల్ ప్రిజనర్స్ (ఏఏపీపీ) శుక్రవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. 328 మంది అసువులుబాశారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3swUtDk

No comments:

Post a Comment