Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Wednesday, 24 March 2021

అసోంలో గెలుపెవరిది: యూపీయేనా? ఎన్‌డీయేనా?.. టైమ్స్ నౌ పోల్ సర్వే

ఈశాన్య రాష్ట్రంలోని అసోంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీని విజయం సాధిస్తుందని టైమ్స్ నౌ-సీ ఓటర్ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి. కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహాజోత్‌ కూటమి, ఎన్డీయే మధ్య హోరాహోరీ పోరు నెలకుందని స్పష్టమయ్యింది. అయితే, హోరాహోరీ పోరులో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే స్వల్ప మెజార్టీతో తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనుందని తేలింది. ఎన్డీయే కూటమికి 65 నుంచి 73 స్థానాలు, యూపీయేకు 52 నుంచి 60, ఇతరులకు 0 నుంచి 4 స్థానాలు లభించనుందని అంచనా వేసింది. ఇక, కాంగ్రెస్ నాయకత్వంలోని మహాజోత్‌కు ముస్లింల మద్దతుపై మిశ్రమ స్పంద లభించింది. దాదాపు 40 శాతం మంది మహాజోత్‌కు ఓటేస్తామని చెప్పగా, 41.6 శాతం మంది మాత్రం వేయమని చెప్పారు. మిగతా 18.7 శాతం మంది ఏమీచెప్పలేమని అన్నారు. ఏఐయూడీఎఫ్‌కి ఓటేస్తే అక్రమ వలసదారులను ప్రోత్సహించినట్టేనన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటనను సమర్ధిస్తారా? అంటే 44.4 శాతం మంది అవునని, 38.7 శాతం మంది కాదని చెప్పగా.. మిగిలిన 16.9 శాతం మంది సరైందికాదని అన్నారు. సీఏఏపై మౌనం అసోంలో బీజేపీకి సహకరిస్తుందా లేదా దాని అవకాశాలను దెబ్బతీస్తుందా అని అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. మొత్తం 44.6 శాతం మంది ఈ అంశంపై బీజేపీ గెలుపు అవకాశాలను పెంచుతుందని, 25.2 శాతం మంది అవకాశాలను దెబ్బతీస్తుందని చెప్పారు. అయితే, ఎన్నికల ఫలితాలపై ఇది ఎలాంటి ప్రభావం చూపదని 15.8 మంది అభిప్రాయపడగా, 14.4 శాతం మంది ఖచ్చితంగా చెప్పలేమని అన్నారు. అసోం భాషా సంస్కృతిలకు సీఏఏ వల్ల ముప్పు ఏర్పడుతుందా? అన్న ప్రశ్నకు 50.9 శాతం మంది అవునని సమాధానం ఇచ్చారు. అయితే, 31.2 శాతం మంది కాదని చెప్పగా, 17.9 శాతం మంది చెప్పలేమని పేర్కొన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరికి ఓటేస్తారని అడిగితే ఎన్‌డీఏకు 45 శాతం, యూపీయేకు 41.1 శాతం, ఇతరులకు 13.9 శాతం మంది అనుకూలంగా వెల్లడించారు. ముఖ్యమంత్రిగా శర్వానంద్ సోనోవాల్‌కు 46.2 శాతం, కాంగ్రెస్ నేత గౌరవ్ గొగొయ్‌కు 25.2 శాతం మంది మొగ్గుచూపారు. ఇదిలా ఉండగా కేంద్రంలోని బీజేపీ పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా? అన్న ప్రశ్నకు 32.69 శాతం చాలా బాగుందని, 30.95 శాతం మంది బాగుందని, 27.44 శాతం మంది పనితీరుబాగులేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై 39.02 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయగా, 33.74 మంది ఓ మోస్తరుగా ఉందన్నారు. 17.9 శాతం మంది మాత్రమే అధ్వాన్నంగా ఉందని, 9.33 శాతం మంది చెప్పలేమని అన్నారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3snklkN

No comments:

Post a Comment