
చిరుతలు మనుషులపైనా, జంతువులపైనా దాడులు చేస్తుంటాయి. వాటికి కంటికి కనిపిస్తే చాలు మీదకు దూసుకొచ్చేస్తాయి. వాటి బారిన పడకుండా జంతువులు పరుగులు తీస్తుంటాయి. అయితే తాజాగా చిరుత ఓ పసికందుపైకి దూసుకెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటరిగా ఉన్న పిల్లాడి మీద దాడి చేయడానికి ప్రయత్నించింది. చివరికి తన వల్ల కాక తోక ముడిచి.. వెనక్కి వెళ్లిపోయింది. యూకేలోని వెస్ట్ మిడ్‌లాండ్స్ సఫారీ పార్క్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో ఓ నెలల పసికందు నేలపై పాకుతూ ఆడుకుంటుండగా చిరుత వాడిపై దాడి చేయబోయింది. పిల్లవాడు పాక్కుంటూ ఇంటి గుమ్మం వరకు వెళ్తుండగా ఓ చిరుత వేగంగా వచ్చి ఆ పసికందుపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. కానీ దాడి చేయడం వీలుకాక వెనక్కి వెళ్లిపోయింది. మధ్యలో ఒక గ్లాస్ అడ్డంగా ఉండడం వల్ల, పులి లోపలికి రాలేకపోయింది. దాంతో పిల్లవాడు బతికి బట్టకట్టాడు. అయితే చిరుత వచ్చినప్పుడు చిన్నారి పెద్దగా ఏడ్చాడు. అయితే దీనికి సంబంధించిన అయింది. వీడియోలో ఈ ఘటనను చూసి అందరూ షాక్ అవుతున్నారు. పసిపిల్లవాడి మీదకు పులి రావడాన్ని చూసి భయాందోళనకు గురవుతున్నారు. ఒక వేళ ఆ గాజు అద్దం పగలిపోతే పరిస్థితి ఏంటని సందేహాలు వెలిబుచ్చుతున్నారు. అద్దం లేకపోయుంటే పసికందు పరిస్థితి ఏంటంటూ కామెంట్లు పెడుతున్నారు.
from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/1ex7YHy
No comments:
Post a Comment