తెలంగాణ కబడ్డీ ఆటగాళ్లకు తమిళనాడు రాజధాని చెన్నైలో చేదు అనుభవం ఎదురైంది. ఆర్టీసీ బస్సులో కండక్టర్‌తో అనుచితంగా ప్రవర్తించిన కబడ్డీ కోచ్‌పై ప్రయాణికులు తిరగబడి దాడికి పాల్పడ్డారు. ఆయన వెంట ఉన్న ఆటగాళ్లను కూడా పరుగెత్తించి కొట్టారు. ఈ ఘటనకు కారకుడైన కబడ్డీ కోచ్ లక్ష్మణ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. Also Read: తెలంగాణకు చెందిన 59మంది కబడ్డీ ఆటగాళ్ల గత వారం పోటీల నిమిత్తం పుదుచ్చేరికి వెళ్లారు. అక్కడ టోర్నమెంట్ ముగిసిన తర్వాత వారంతా చెన్నై చేరుకున్నారు. ఆటగాళ్లంతా రెండు బృందాలుగా విడిపోయి రెండ్రోజులుగా చెన్నై నగరంలోని పర్యాటక ప్రదేశాలను తిలకిస్తున్నారు. మంగళవారం 39 మంది ఆటగాళ్లు ఓ బృందంగా బయటకు వచ్చి నగరాన్ని చూసేందుకు తమిళనాడు ఆర్టీసికి చెందిన 29A నంబరు గల బస్సు ఎక్కారు. Also Read: టిక్కెట్ విషయంలో బస్సు కండక్టర్‌తో వాగ్వాదం జరగడంతో కబడ్డీ కోచ్ లక్ష్మణ్ అతడిపై చేయి చేసుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరగగా ఆటగాళ్లు కోచ్‌కు మద్దతుగా నిలిచి బస్సులో గలాటా సృష్టించారు. ఈ ఘటనతో ఆగ్రహించిన బస్సులోని తమిళ ప్రయాణికులు కోచ్‌తో పాటు ఆటగాళ్లపై దాడికి పాల్పడ్డారు. దీంతో వారంతా తలోదిక్కుకు పారిపోయారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని కోచ్‌తో పాటు ఆటగాళ్లందరినీ స్టేషన్‌కు తరలించారు. ఆటగాళ్లను విచారించి వదిలేయాగా గొడవకు కారణమైన కోచ్ లక్ష్మణ్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. దీంతో ఆటగాళ్లు ఆయన్ని విడిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2HFVrb0
0 Comments