మధ్య వయసున్న గుర్తు తెలియని యువతి మృతదేహం మంగళగిరిలో కలకలం రేపింది. కాల్వలో యువతి శవం కనిపించడం చర్చనీయాంశమైంది. చానల్ కాల్వలో మున్సిపల్ పంప్ హౌస్ వద్ద యువతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలిని మండలం ప్రకాష్ నగర్ వాసిగా గుర్తించారు. యువతి ఎవరు? ఎవరైనా హత్య చేశారా? లేక ఆమె ఆత్మహత్యకు పాల్పడిందా? అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. మృతురాలి భర్తే హత్య చేసి కాల్వలో పడేశాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలోనూ మంగళగిరి స్టేడియం సమీపంలో యువతిని దారుణంగా హత్య చేసిన ఘటన చోటచేసుకుంది. ప్రియుడే ఆమెను అతి కిరాతకంగా చంపి.. ఒంటరిగా ఉన్న తమపై ఎవరో దాడి చేసి చంపేసినట్లు చిత్రీకరించే యత్నం చేశాడు. Also Read: ఎట్టకేలకు పోలీసులు ఆ కేసును ఛేదించారు. పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని ప్రియుడే ఆమెను హత్య చేసినట్లు నిర్ధారించారు. అప్పట్లో ఈ కేసు పెద్ద సంచలనమైంది. మృతురాలిది తాడేపల్లి కావడం గమనార్హం. తాజాగా మరో యువతి మృతదేహం కనిపించడంతో కలకలం రేగింది. ఈ ఘటనపై స్పష్టత రావాల్సి ఉంది.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/37YL4tI
0 Comments