కొడుకు ప్రేమకు బలైపోయిన తండ్రి.. యాదాద్రి జిల్లాలో వ్యక్తి దారుణహత్య

ప్రేమ వివాహం ఓ వ్యక్తి దారుణ హత్యకు దారితీసిన ఘటన తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలంలో జరిగింది. జనగాం గ్రామంలో ఈ నెల 5న జరిగిన దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రేమ వివాహమే హత్యకు కారణంగా తేల్చారు. యాదాద్రి డీసీపీ నారాయణరెడ్డి కథనం ప్రకారం... గొండిగళ్ల గాలయ్య కుమారుడు బాబు, గడ్డం గాలయ్య కుమార్తె నవనీత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరు గతేడాది అక్టోబరులో ఇంటి పారిపోయారు. ప్రేమించిన యువకుడితోనే పెళ్లి చేస్తామని నమ్మించిన నవనీత కుటుంబ సభ్యులు ఆమెను ఇంటికి తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే మరో యువకుడితో ఫిబ్రవరి 15వ తేదీన నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేశారు. నవనీత ప్రేమ వ్యవహారం తెలుసుకున్న మగ పెళ్లివారు ఆ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారు. తల్లిదండ్రులు తనకు బలవంతపు పెళ్లి చేస్తారన్న భయంతో అదే నెల 22న నవనీత ప్రియుడు బాబుతో కలిసి దూరంగా వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది.

ఈ ఘటనతో నవనీత తల్లిదండ్రులు, సోదరులు బాబు కుటుంబంపై కక్ష పెంచుకున్నారు. వారి హత్యకు పుట్టపాక గ్రామానికి చెందిన తమ సమీప బంధువైన లవలేశ్‌తో కలిసి పథకం పన్నారు. ఈ సమయంలోనే చాలాకాలంగా ముంబయిలో ఉంటున్న బాబు తండ్రి గొండిగళ్ల గాలయ్య.. కరోనా భయంతో గ్రామానికి తిరిగొచ్చాడు. 15 రోజుల హోమ్ క్వారంటైన్ తర్వాత బయటికొచ్చిన గాలయ్యపై ఈ నెల ఐదో తేదీన నారాయణపురం వెళ్లొస్తుండగా నవనీత సోదరుడు సురేశ్ కల్లుగీసే కత్తితో అతడిపై దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావంతో గాలయ్య అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

Also Read:

అమ్మాయి కోసం రెండు గ్రూపుల ఘర్షణ.. గుంటూరులో కలకలం రేపిన గ్యాంగ్‌ వార్

నవనీత కుటుంబసభ్యులే అతడిని చంపి ఉండొచ్చని మృతుడి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తమ కూతురిని తీసుకుపోయి పెళ్లి చేసుకున్న బాబుపై నవనీత కుటుంబం కక్ష పెంచుకుంది. దీంతో అతడిని ఎలాగైనా చంపేయాలని నవనీత తండ్రి గడ్డం గాలయ్య(50), సోదరులు సురేశ్‌(26), వెంకటేశ్‌(30), రమేశ్‌(28), స్వామి(27), రాజు(22), పుట్టపాకు చెందిన బంధువు దాసరి లవలేశ్‌(36) ప్లాన్ వేశారు. అందుకే నవనీత ఇంటి నుంచి వెళ్లిపోయినా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. మరో వైపు ఎంత గాలించినా బాబు ఆచూకీ వారికి దొరకడం లేదు.

Also Read:

మూడేళ్లు ప్రేమించి పెళ్లికి మొహం చాటేసిన ప్రియుడు.. మహిళ ఆత్మహత్య

ఇదే సమయంలో బాబు తండ్రి గాలయ్య సురేశ్‌కు తారసపడ్డాడు. మద్యం మత్తులో ఉన్న సురేశ్‌ వెంటనే కత్తితో గాలయ్యను పొడిచి చంపి పారిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడు సురేశ్‌తో పాటు అతడి కుటుంబానికి చెందిన ఆరుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ఓ కత్తి, స్కూటీ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను సోమవారం నల్గొండ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్‌ విధించారు. దీంతో పోలీసులు వారిని జైలుకు తరలించారు. ఈ కేసును చేధించిన పోలీసు సిబ్బందిని యాదాద్రి డీసీపీ నారాయణరెడ్డి అభినందించారు.

Also Read:

పోకిరీ వేధింపులు.. హైదరాబాద్‌లో బీటెక్ విద్యార్థిని సూసైడ్



from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2MDVoOZ

Post a Comment

0 Comments