కడప: పెళ్లైన 2 నెలలకే మామతో అక్రమ సంబంధం.. ప్రాణం తీసిన భర్త

పరాయి వ్యక్తితో పెట్టుకుందన్న కక్షతో ఓ వ్యక్తి భార్యను కిరాతకంగా చంపేసిన ఘటన జిల్లాలో వెలుగుచూసింది. పులివెందులలోని రోటరీపురం వీధికి చెందిన వీరమ్మ (20) హత్య కేసులో పోలీసులు ఆమె భర్త అశోక్‌, అతడి అన్న శ్రీరాములును అరెస్ట్ చేసి హత్యకు వినియోగించిన ప్లాస్టిక్ తాడును స్వాధీనం చేసుకున్నారు. అనంతపురానికి చెందిన వీరమ్మకు పులివెందులలోని రోటరీపురంలో నివసించే అశోక్‌తో గత రెండు నెలల క్రితం వివాహం జరిగింది. Also Read: అయితే కొద్దిరోజులకే అదే వీధిలో ఉండే మామ వరుసైన ఆంజనేయులుతో వీరమ్మ అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త కళ్లుగప్పి అతడితో రాసలీలలు కొనసాగిస్తోంది. అశోక్ ఇంట్లో లేని సమయంలో ఆంజనేయులు ఇంటికి వచ్చి గంటల తరబడి ఉండటం అతడి అన్న శ్రీరాములుకు అనుమానం వచ్చింది. దీంతో నిఘా పెట్టగా ఓ రోజు వీరమ్మ, ఆంజనేయులు గదిలో ఏకాంతంగా గడుపుతూ కనిపించారు. ఈ విషయాన్ని శ్రీరాములు తన తమ్ముడు అశోక్‌కు చెప్పాడు. దీంతో పద్ధతి మార్చుకోవాలని అతడు వీరమ్మను హెచ్చరించాడు. తన మాటలు భార్య వినిపించుకోకపోవడంతో చంపేయాలని అన్నతో కలిసి నిర్ణయించుకున్నాడు. Also Read: పథకం ప్రకారం ఈ నెల 17 తేదీన పట్టణంలోని శిల్పారామం వెనుక ప్రాంతంలోకి అశోక్ తన భార్యను తీసుకెళ్లాడు. అక్కడ అన్నదమ్ములిద్దరూ కలిసి వీరమ్మ గొంతుకు తాడు గట్టిగా బిగించి లాగడంతో పాటు రాళ్లతో తలను పగలకొట్టి హత్య చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా అక్కడే భూమిలో మృతదేహాన్ని పూడ్చి వెళ్లిపోయారు. ఈ నెల 21వ తేదీన అటువైపు వెళ్తున్న కొందరు శవం పైకి తేలడం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆమె భర్త, అతని అన్న కలసి ఈ హత్య చేసినట్టు నిర్ధారించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2YLYSoM

Post a Comment

0 Comments