నడికూడ మండల కేంద్రంలో BRS బలపరచిన సర్పంచ్ అభ్యర్థి
గోనెల శరత్ గారి ఇంటింటికి ప్రచారంలో భాగంగా ఈ రోజు BRS మాజీ ఎమ్మెల్యే శ్రీ చల్లా ధర్మారెడ్డి గారు నడికూడ మండల కేంద్రంలో పర్యటించడం జరిగింది, ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసింది, ఒక్క పథకాన్ని కూడా సమర్ధవంతంగా పూర్తి చేయకుండా దాటవేస్తూ వస్తుంది, వారిని నమ్మి మళ్ళీ మోసపోవద్దు అని ప్రజలకు పిలుపు నిచ్చారు, ఎన్నికల సమయంలో ఎవరు ఏమి చెప్పినా వినొద్దు, గోనెల శరత్ బ్యాటు గుర్తుపై ఓటువేసి అధిక మెజారిటీ తో గెలిపిస్తే నడికూడ అభివృద్ధి పథంలో ఉంటుంది అని అయన తెలిపారు, సర్పంచ్ అభ్యర్థి గోనెల శరత్ గారు మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నాకు పార్టీ టికెట్ ఇచ్చిన శ్రీ చల్లా ధర్మారెడ్డి గారికి నా తరుపున మరియు మా కుటుంభం తరుపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, అలాగే నా గెలుపుకోసం కృషి చేస్తున్న BRS కార్యకర్తలకు, అభిమానులకు, గ్రామ ప్రజలకు నా నిండు వందనాలు, నడికూడ గ్రామ ప్రజలు ఈ ఒక్కసారి నన్ను ఆశీర్వదించండి మీకు ఎల్లవేళలా రుణపడి ఉంటాను, నడికూడ గ్రామ అభివృద్ధిలో ముందుండి నడిపిస్తాను, ఎ పార్టీ వారు తలుపు తట్టినా తప్పకుండా మీ వెన్నంటి ఉంటానని మీకు మాట ఇస్తున్నాను, నడికూడ గ్రామ ప్రజలంతా బ్యాటు గుర్తును గుర్తు పెట్టుకొని ఓటువేసి అధిక మెజారిటీ తో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ గ్రామాల BRS నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు మరియు యూత్ సభ్యులు పాల్గొన్నారు.


0 Comments