అద్భుతం అమిత్ జీ.. ఎయిమ్స్‌కు వెళ్లకుండా ప్రయివేట్ ఆస్పత్రికా: శశి థరూర్

కరోనా వైరస్ బారినపడ్డ కేంద్ర హోం మంత్రి చికిత్స కోసం ఓ ప్రయివేట్ హాస్పిటల్‌లో చేరిన విషయం తెలిసిందే. అయితే, ఆయన ప్రభుత్వ ఆస్పత్రిలో చేరకుండా.. ప్రయివేట్ ఆస్పత్రిలో చేరడంపై ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రజల్లో విశ్వాసాన్ని ప్రేరేపించాలంటే ప్రభుత్వ సంస్థలకు శక్తివంతుల ప్రోత్సాహం అవసరమని అన్నారు. గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్‌లో ప్రస్తుతం అమిత్ షా చికిత్స పొందుతున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన తన ఆరోగ్యం నిలకడగానే ఉంది.. కానీ, హాస్పిటల్‌లో చేరాలని వైద్యులు సూచించారు అని అమిత్ షా ట్విట్టర్‌లో తెలిపారు. తనతో కాంటాక్ట్‌లో ఉన్నవారంతా పరీక్షలు చేయించుకుని, క్వారంటైన్‌కు వెళ్లాలని కోరారు. అమిత్ షా ప్రయివేట్ ఆస్పత్రిలో చేరడంపై స్పందించిన థరూర్.. ‘అద్బుతం.. అనారోగ్యానికి గురైన మన హోం మంత్రి చికిత్స కోసం ఎయిమ్స్‌లో చేరకుండా పొరుగు రాష్ట్రంలో ఉన్న ప్రయివేట్ ఆస్పత్రిలో చేరారు.. ఒకవేళ ప్రజల్లో విశ్వాసాన్ని ప్రేరేపించాలని భావిస్తే ప్రభుత్వ సంస్థలకు శక్తివంతుల ప్రోత్సాహం అవసరం’ అని అన్నారు. ‘ఆధునిక భారతదేశంలోని దేవాలయాల్లో తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ హాయంలో నిర్మించిన ఎయిమ్స్ ఒకటి.. ఆధునిక భారతదేశంలో అభివృద్ధికి దూరదృష్టితో భారీ పరిశ్రమలు, సాంకేతిక పరిశోధన సంస్థలు, విద్యా సంస్థలు, ఆర్ధిక సంస్థలు ఏర్పాటు చేశారంటూ’ ఓ వ్యక్తి చేసిన ట్వీట్‌ను థరూర్ రీట్వీట్ చేశారు. కరోనా వైరస్ సోకిన కర్ణాటక, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు యడియూరప్ప, శివరాజ్ సింగ్ చౌహన్ సైతం ప్రయివేట్ ఆస్పత్రిలోనే చికిత్సకు చేరారు. బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో యడ్డీ చేరగా.. భోపాల్‌లోని చరయూ ఆస్పత్రిలో చౌహన్ చికిత్స పొందుతున్నారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3kgISEG

Post a Comment

0 Comments