డ్యూటీకి వెళ్లిన భర్త.. పిల్లలను ఇంట్లోనే వదిలేసి వెళ్లిపోయిన భార్య

భర్త ఇంట్లో లేని సమయంలో భార్య పిల్లలను వదిలేసి ఒంటరిగా వెళ్లిపోయిన ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది. మీర్‌పేట్‌ నందనవనంలో ఎస్‌కే అక్బర్‌ అనే వ్యక్తి భార్య నవాబీ, పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. డ్రైవర్‌గా పనిచేసే అతడు డ్యూటీలో భాగంగా ఈ నెల 25వ తేదీన కర్నూలు వెళ్లాడు. ఆ తర్వాతి రోజే నవాబీ పిల్లలను ఇంట్లోనే వదిలి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. Also Read: దీంతో పిల్లలు తండ్రికి ఫోన్ చేసి అమ్మ ఎక్కడికో వెళ్లిపోయిందని చెప్పారు. అక్బర్ వెంటనే ఇంటికి చేరుకుని బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. ఆమె సెల్‌ఫోన్ సైతం స్విచ్ఛాఫ్ రావడంతో ఏం జరిగిందోనని కంగారుపడుతూ శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య మిస్సింగ్ వెనుక దేవి అనే మహిళ ప్రమేయం ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/34JC9Od

Post a Comment

0 Comments