జమ్మూకశ్మీర్‌లో తాజ్‌మహల్…. పైసా ఖర్చు లేకుండా 17 రోజుల్లో నిర్మాణం

ఆగ్రా‌లో తాజ్‌మహల్ గురించి అందరికి తెలిసిందే.. ఒక్కసారైనా ప్రేమ జంటలు అక్కడకు వెళ్లాలనుకుంటారు. ప్రేమకు ప్రతిరూపంగా నిలిచే దానిని దగ్గరగా చూడాలనుకుంటారు. అయితే ఇప్పుడు జమ్మూకశ్మీర్‌లో కూడా ఓ తాజ్‌మహల్ వెలిసింది. పైగా దానిని చూడ్డానికి కూడా ప్రేమికులు ఎగబడుతున్నారు. దానికి కూడా అంత ప్రత్యేకత ఉంది మరి. ఎందుకంటే ఆ తాజ్‌మహల్‌ను మంచుతో తయారుచేశారు. పర్యాటకులు ఎంతో ఇష్టపడే గుల్మార్గ్‌లో ఇటీవలే హిమంతో తాజ్‌మహల్‌ను నిర్మించారు. అక్కడ ఎక్కువగా మంచు కురుస్తోంది. అలా కురిసిన మంచుతో 16 అడుగుల పొడవు, 24 అడుగుల విస్తీర్ణంలో గ్రాండ్ ముంతాజ్ హోటల్ నిర్వాహకులు తాజ్‌మహల్‌ను నిర్మించారు. యూసఫ్ బాబా అనే వ్యక్తి ఆధ్వర్యంలో నలుగురు సభ్యులు ఆ మంచుకు తాజ్‌మహల్‌కు రూపమిచ్చారు. పైసా ఖర్చు లేకుండానే ప్రేమ చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. అయితే దీనికోసం 17 రోజులు కష్టపడ్డారు. నిజానికి గుల్మార్గ్‌లో ఇగ్లూ కేఫ్ నిర్మాణంతో పర్యాటకులు అక్కడకు క్యూ కడుతున్నారు. అక్కడకు వెళ్లి ఆనందపడుతున్నారు. పర్యాటకుల సందడి పెరగడంతో గుల్మార్గ్ టాప్‌లిస్ట్‌లో ఉంది. ఇప్పుడు మంచుతో ఏర్పాటు చేసిన తాజ్ మహల్‌‌ను చూడ్డానికి జనం ఎగబడుతున్నారు. దాని దగ్గరకు వెళ్లి ఫోటోలు తీసుకుంటున్నారు. “ఈ తాజ్ మహల్ చాలా అందంగా ఉంది. మళ్లీ సాయంత్రం వచ్చి లైటింగ్‌ ఏర్పాటు చేసి చూస్తాం. ఇది చాలా ప్రత్యేకమైన విషయం” అని హర్యాణాలోని గుర్గావ్ నివాసి రష్మీ అన్నారు. అక్కడకు వెళ్లే టూరిస్టులకు మంచి అనుభూతిని అందించాలనే లక్ష్యంతో హోటల్ గ్రాండ్ ముంతాజ్ సభ్యులు మంచు తాజ్‌మహల్‌ను ఏర్పాటు చేశారంట. అయితే వారి ప్లాన్ సక్సెస్ అయింది.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/hRfgU9d

Post a Comment

0 Comments