ఈ ఏడాది తొలి ప్రయోగానికి కౌంట్ డౌన్ స్టార్ట్…. రేపు నింగిలోకి పీఎస్ఎల్వీ సీ 52 రాకెట్‌

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 2022లో చేపట్టిన మొదటి మొదలైంది. ఫిబ్రవరి 13వ తేదీ ఆదివారం తెల్లవారుజామున 4.29 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించారు. 25 గంటల 30 నిమిషాల కౌంట్‌డౌన్ పూర్తవగానే శ్రీహరికోటలోని షార్‌ నుంచి సోమవారం ఉదయం 5:59గంటలకు నింగిలోకి దూసుకెళ్లనుంది. "PSLV-C52/EOS-04 మిషన్ ప్రయోగానికి 25 గంటల 30 నిమిషాల కౌంట్‌డౌన్ ప్రక్రియ ఆదివారం తెల్లవారుజామున 04:29 గంటలకు ప్రారంభమైంది" అని ఇస్రో ఒక ట్వీట్‌ ద్వారా తెలియజేసింది. ఈ పీఎస్‌ఎల్వీసీ 52 రాకెట్ 1710 కిలోల బరువున్న ఆర్ఐశాట్ ‌(ఈవోఎస్‌-04), 17.5 కిలోల ఐఎన్‌ఎస్‌-2టీడీ, 8.1 కిలోల ఇన్‌స్పైర్‌శాట్‌-1 ఉపగ్రహాలను మోసుకెళ్లనుంది. ఈ ఉపగ్రహాన్ని 529 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి ఇస్రో ప్రవేశపెట్టనుంది. అలాగే ఇన్‌స్పైర్‌శాట్‌-1 ఉపగ్రహాన్ని కొంతమంది విద్యార్థులు కలసి రూపొందించారు. యూఎస్‌లోని కొలరాడో బౌల్డర్‌ యూనివర్సిటీలోని ల్యాబరేటరీ ఫర్‌ అట్మాస్ఫియరిక్‌ అండ్‌ స్పేస్‌ ఫిజిక్స్‌, నేషనల్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ, తైవాన్‌, సింగపూర్‌లోని నాన్యాంగ్‌ టెక్నాలజికల్‌ విశ్వవిద్యాలయం, తిరువనంతపురంలోని ఐఐఎస్‌టీ సహకారంతో రూపకల్పన చేశారు. కాగా ఈ ప్రయోగం విజయవంతం అవ్వాలని కోరుకుంటూ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఇస్రో సైంటిస్టులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మొక్కులు చెల్లించుకున్నారు. రాకెట్ నమూనాను మూలవిరాట్ పాదాల దగ్గర ఉంచి పూజలు కూడా నిర్వహించారు.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/wG4Y6oH

Post a Comment

0 Comments