మద్యానికి డబ్బులివ్వలేదన్న కోపంతో ఓ తాగుబోతు కట్టుకున్న భార్యనే కిరాతకంగా చంపేసిన ఘటన జిల్లా మండలంలోని గ్రామంలో జరిగింది. ఓబుళాపురానికి చెందిన చెందిన సుంకమ్మ నాలుగో కూతురు చౌడమ్మ (35)కు పాత గుంతకల్లుకు చెందిన బేల్దారి బోయ శ్రీనివాసులుతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. కట్న కానుకల కింద 3 తులాల బంగారం, రూ.15 వేలు ఇచ్చారు. వీరికి చరణ్ (7), శృతి (4) సంతానం. కూతురు హాయిగా ఉండాలన్న ఉద్దేశంతో సుంకమ్మ ఓ ఇల్లు కట్టించి ఇచ్చింది. దీనికి తోడు అవసరమైనప్పుడల్లా ఆర్థిక సాయం కూడా చేసేది. Also Read: అయితే కొంతకాలంగా శ్రీనివాసులు మద్యానికి బానిసయ్యాడు. డబ్బు కోసం భార్యను తరుచూ వేధించేవాడు. భర్త వేధింపులతో విసిగిపోయిన చౌడమ్మ వారం రోజుల క్రితం గుంతకల్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో అత్తింటికి వెళ్లిన శ్రీనివాసులు తలుపు తట్టాడు. చౌడమ్మ తలుపు తీసి ఇప్పుడెందుకు వచ్చావని ప్రశ్నించగా పిల్లలను చూడాలని వచ్చానని చెప్పాడు. కాసేపటి తర్వాత అందరూ నిద్రపోయాక శ్రీనావాసులు కత్తితో భార్య మెడపై నరికేశాడు. అడ్డుకోబోయిన అత్తపై కూడా దాడిచేసి పరారయ్యాడు. Also Read: తీవ్ర రక్తస్రావంతో చౌడమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఓబుళాపురం గ్రామంలో విషాదం నెలకొంది. ముక్కుపచ్చలారని పిల్లలకు తల్లి ఇకలేదని ఎలా చెప్పాలంటూ కుటుంబసభ్యులు, బంధువుల కన్నీరుమున్నీరవుతున్నారు. మృతురాలి తల్లి సుంకమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2YMTAte
0 Comments