ప్రియుడితో కలిసి ఆస్ట్రేలియాలో విహారయాత్ర... గుట్టురట్టు చేసిన కరోనా

కరోనా వైరస్ కారణంగా ఇటీవల ఎన్నో అక్రమ సంబంధాలు బట్టబయలైన సంగతి తెలిసిందే. ఈ కోవలోనే భర్త వేరే ప్రాంతంలో ఉద్యోగం చేస్తుండటంతో మరో వ్యక్తితో పెట్టుకుందో మహిళ. అందరి కళ్లుగప్పి అతడితో విహారయాత్ర కోసం ఆస్ట్రేలియాకు వెళ్లింది. ఈలోగా లాక్‌డౌన్ అమల్లోకి రావడంతో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అదే సమయంలో భర్త ఇంటికి రావడంతో ఆ ఇల్లాలి బండారం బట్టబయలైంది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో వెలుగుచూసింది. Also Read: యూపీలోని ఫిలిబిత్‌ సమీపంలోని దామ్‌గరీ గ్రామానికి చెందిన వ్యక్తి(46)కి 20 ఏళ్ల క్రితం వివాహమైంది. ఉద్యోగ రీత్యా కొంతకాలంగా అతడు ముంబైలో ఉంటున్నాడు. సంపాదించిన సొమ్ముతో స్వగ్రామంలోనే ఓ ఫామ్‌హౌస్ కొనుగోలు చేశాడు. దాని బాధ్యతలు చూసుకుంటూ భార్య గ్రామంలోనే ఉంటోంది. అతడు మాత్రం ఏడాదిలో రెండు మూడుసార్లు వచ్చి వెళ్తుంటాడు. వీరి ఒక్కగానొక్క కుమారుడు ఆస్ట్రేలియాలో చదువుకుంటున్నాడు. దీంతో ఒంటరిగా ఉంటున్న ఆమె అదే గ్రామానికి చెందిన సందీప్ సింగ్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. Also Read: తన ఫామ్‌హౌస్‌కు ప్రియుడిని రప్పించుకుని రోజూ రాసలీలు కొనసాగిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు ఆస్ట్రేలియాలో ప్రియుడితో విహరించాలని కోరిక కలిగింది. దీంతో తన భర్త సర్టిఫికెట్లతో ప్రియుడికి పాస్‌పోర్టు రప్పించింది. ఇద్దరూ కలిసి జనవరి 6న చెక్కేశారు. మార్చి చివరి వారంలో తిరిగి ఇండియాకు వచ్చేందుకు ప్లాన్ చేసుకోగా ఈలోగా లాక్‌డౌన్ అమల్లోకి రావడంతో అక్కడే చిక్కుకుపోయారు. Also Read: మే 18వ తేదీన ఇంటికి వచ్చిన భర్త.. తన భార్య కనిపించకపోవడంతో కంగారుపడ్డాడు. స్థానికులను ఆరా తీయగా ఆమె బంగారం బయటపడింది. దీంతో తాను కష్టపడి సంపాదించిన సొమ్ముతో భార్య, ఆమె ప్రియుడు ఎంజాయ్ చేస్తున్నారని తెలుసుకుని షాకయ్యాడు. స్థానిక పోలీస్‌స్టేషన్లో వారిద్దరిపై ఫిర్యాదు చేశాడు. అయితే ఈ అక్రమ జంట వందేభారత్ మిషన్‌లో భాగంగా ఆగస్టు 24న ఇండియా వచ్చారు. తనను మోసం చేసి భార్యపై కఠినచర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నాడు. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/34JxMTj

Post a Comment

0 Comments