బంధువులని బెడ్రూమ్ ఇస్తే నీచం.. గుంటూరులో షాకింగ్ ఘటన

ఆశ్రయమిచ్చిన ఇంటికే కన్నమేశాడో ప్రబుద్ధుడు. బంధువు కదా అని బెడ్రూమ్‌ ఇస్తే బీరువాని దోచేశాడు. తనకేం తెలియనట్లు బిల్డప్ ఇచ్చి చెక్కేశాడు. పంచాయితీ పోలీస్ స్టేషన్‌కి చేరడంతో ఇంటి దొంగ గుట్టురట్టైంది. ఈ షాకింగ్ ఘటన గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో జరిగింది. పట్టణంలోని సుభాని నగర్‌కి చెందిన అబ్దుల్ రహీమ్ మేనకోడలు షాహిన్‌కి చెన్నైకి చెందిన అలీ హర్మాస్‌తో వివాహమైంది. ఇటీవల రహీమ్ కూతురు ప్రసవించడంతో చూసేందుకని మేనకోడలు తన భర్తతో కలసి చెన్నై నుంచి వచ్చింది. బంధువులు వచ్చారని రహీమ్ తన బెడ్రూమ్ వాడుకోవాలని చెప్పాడు. బెడ్రూమ్‌లో ఉన్న బీరువాపై హర్మాస్ కన్నుపడింది. అక్కడే తాళాలు కూడా తగిలించి ఉండడంతో చేతివాటం చూపాడు. బీరువాలో ఉంచిన సుమారు 150 గ్రాముల బంగారు ఆభరణాలను అపహరించాడు. బీరువాలో పెట్టిన నగలు కనిపించకపోవడంతో చోరీకి గురైనట్లు రహీమ్ గుర్తించాడు. అయితే తనకేమీ తెలియనట్లు బింకం ప్రదర్శించిన హర్మాస్ వెంటనే చెన్నై వెళ్లిపోయాడు. Also Read: హర్మాస్‌పై అనుమానం వచ్చిన రహీమ్ పట్టణ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. భార్యను తీసుకెళ్లేందుకు చెన్నై నుంచి వచ్చిన హర్మాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని తమ స్టైల్లో విచారించడంతో అసలు నిజం కక్కేశాడు. చేసినట్లు ఒప్పుకున్నాడు. అతని నుంచి 153 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కటకటాల వెనక్కి పంపించారు. Read Also:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/339b2Ld

Post a Comment

0 Comments