యువత క్రీడల్లో రాణించాలి : గోనెల శరత్ BRS సర్పంచ్ అభ్యర్థి

 


నడికూడ మండల కేంద్రంలో BRS సర్పంచ్ అభ్యర్థి ఉన్న గోనెల శరత్ గారు మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణించాలి, క్రీడలు యువతకు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసన్ని, మరియు పోటీ తాత్వాన్ని పెంపొందిస్థాయని ఆయన అన్నారు. ఇప్పుడున్న యువత ఎక్కువకాలం మొబైల్ తో గడుపుతూ సమయం వృధా చేయడంతో పాటు పోటీతత్వంకు మరియు మనుషులతో సంబంధాలు కోల్పోతున్నారని అయన అన్నారు, అయన క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించి, బాగా గడ్డి పేరుకుపోయి ఉన్న స్థలాన్ని వెంటనే డోజర్ తో క్లీన్ చేసి, గ్రామ యూత్ కి, వాలీబాల్ మరియు షటిల్ కిట్స్ పంపిణి చేయడం జరిగింది, తల్లి దండ్రులకు కూడా తమ పిల్లలను క్రీడల పట్ల మక్కువ ఉన్న విద్యార్థులను ప్రోత్సహించాలని కోరారు, భవిష్యత్తులో అన్ని క్రీడలకు సంబంధించిన గ్రౌండ్స్ కొరకు కృషి చేసి మరిన్ని క్రీడా సామాగ్రిని అందించేలా చూస్తానని అయన యువతకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యూత్,BRS కార్యకర్తలు మరియు గ్రామ సభ్యులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments