పెట్రోల్ బంకులో మంటలు చెలరేగిన షాకింగ్ ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురిలో చోటుచేసుకుంది. బైక్‌లో ఇంధనం నింపుతుండగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. ధర్మపురి మండలం తుమ్మనాలకు చెందిన యువకుడు ఇండియన్ ఆయిల్ వద్ద బైక్ లో పెట్రోల్ పోయిస్తుండగా ఒక్కసారి మంటలు అంటుకున్నాయి. అనూహ్యంగా మంటలు చెలరేగడంతో యువకుడు బైక్ అక్కడే పడేసి బయలకు పరుగుతీశాడు. అయితే పెట్రోల్ బంక్ లో పని చేస్తున్న సిబ్బంది అప్రమత్తమై సాహసం చేశారు. బంకులో ఉన్న ఇసుకను బక్కెట్లలో తెచ్చిపోస్తూ మంటలను అదుపులోకి తెచ్చారు. అనంతరం తగలబడిపోతున్న బైక్‌ను బయటకి లాగేసి మంటల ను అదుపులోకి తెచ్చారు. ఇసుక పోసి మంటలను ఆర్పివేసి ప్రమాదాన్ని తప్పించారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. యాక్సిడెంట్‌కు కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3l8MFUf
0 Comments