రాహుల్ ఏదో ఒక రోజు ప్రధాని అవుతారు: దీపికా పదుకొనె

బాలీవుడ్ నటి .. కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపించిన పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏదో ఒకరోజు రాహుల్‌ మన దేశానికి ప్రధాని అవుతారని ఈ వీడియోలో ఆమె వ్యాఖ్యానించారు. చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు రేపుతున్న డ్రగ్స్‌ కేసులో దీపిక విచారణ ఎదుర్కొంటున్న వేళ.. ఆ వీడియో మరోసారి వైరల్‌గా మారడం చర్చనీయాంశంగా మారింది. గతంలో ఓ జాతీయ మీడియా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్య్వూలో రాహుల్‌పై దీపిక పదుకొనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ఇష్టమైన నేతల్లో రాహుల్‌ ముందుంటారని అన్నారు. భవిష్యత్‌లో ఆయన దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు నిండుగా ఉన్నాయని చెప్పారు. రాహుల్‌లో అసలైన దేశభక్తి కనిపిస్తుందని, యువతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని చెప్పుకొచ్చారు. ‘మంచి నాయకుడికి ఆయనే (రాహుల్ గాంధీ) సరైన ఉదాహరణ. ఏదో ఒక రోజు ఈ దేశానికి ప్రధాని అవుతారనే నమ్మకం నాకు ఉంది. చేస్తున్నది ఏదైనా దేశం కోసమే.. ఆయన ఒక క్లాసిక్ ఉదాహరణ అని అనుకుంటున్నాను’ అని దీపికా పదుకొనె వ్యాఖ్యానించారు. Must Watch: సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్ మరణంపై విచారణ సందర్భంగా తెరపైకి వచ్చిన డ్రగ్స్‌ కేసులో పలువురు హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్సీబీ ఈ కేసులో ఇప్పటికే దీపికా పదుకొనెను ప్రశ్నించింది. 2017 నుంచి తన మేనేజర్ కరిష్మాతో చేసిన చాటింగ్‌లకు సంబంధించిన అంశాలపై దీపికను ఎన్సీబీ ప్రశ్నించింది. దీపికా పదుకొనేతో పాటు బాలీవుడ్‌ నటులు శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్‌ను కూడా ఎన్సీబీ విచారిస్తోంది. గోవాలో ఉన్న దీపికా పదుకొనే.. తన భర్త, నటుడు రణ్‌వీర్ సింగ్‌తో కలిసి సెప్టెంబర్ 24న ముంబైకి తిరిగొచ్చారు. అనంతరం ఎన్సీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ ఉదంతంపై విచారణ కొనసాగుతుండగానే పాత వీడియో వెలుగులోకి రావడం అనుమానాలకు తావిస్తోంది. డ్రగ్స్ కేసు నుంచి దృష్టి మరల్చడానికి కావాలనే ఇలా చేస్తున్నారా? అనే చర్చ జరుగుతోంది. Also Read: Don't Miss:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/33aVXJa

Post a Comment

0 Comments