ప్రజలు ఓట్లు వేస్తేనే ఏ పదవి అయినా దక్కుతుంది. అందుకే ప్రజల మనస్సులను గెలుచుకోవడానికి నాయకులు ఎన్నో హామీలు ఇస్తారు. ఆ టైంలో ఓటర్లతో ఆడతారు.. పాడతారు. అవసరమైతే కాళ్లు కూడా మొక్కుతారు. గెలిచిన తర్వాత ప్రజలకు ఇచ్చిన కొన్ని హామీలను కూడా నెరవేర్చరు. గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఇదే తంతు. దీనికి చెక్ పెట్టేందుకు ఒడిశాలోని ఓ గ్రామ ప్రజలు ప్రయత్నించారు. అక్కడ త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులకు చిన్న టెస్ట్ పెట్టారు. అసలు ఆ పదవికి పోటీ చేసే వ్యక్తులు అర్హులేనా కాదా..? అని ముందే తెలుసుకునే ప్రయత్నం చేశారు. కుట్ర పంచాయతీ మలుపడ గ్రామంలో సర్పంచ్ పదవి కోసం తొమ్మిది మంది పోటీ పడ్డారు. ఆ అభ్యర్థులను మొదట గ్రామస్థులు సమావేశపరిచి ఓ రాత పరీక్ష పెట్టారు. అందులో పాస్ అయిన వారికే తాము ఓటు వేస్తామని తేల్చి చెప్పారు. దాంతో ఆ పరీక్ష రాయడానికి ఎనిమిది మంది సిద్ధమయ్యారు. గ్రామస్థులు ఏడు ప్రశ్నలతో కూడిన ప్రశ్నా పత్రాన్ని తయారు చేశారు. అందులో ఇది వరకూ సేవా కార్యక్రమాలు ఏమైనా చేశారా..? సర్పంచ్‌గా ఎన్నికైతే ఏఏ అభివృద్ధి పనులు చేస్తారు…? గెలిచిన తర్వాత గ్రామస్థుల యోగ క్షేమాలు పట్టించుకుంటారా..? వంటి ప్రశ్నలు పొందుపరిచారు. అయితే ఈ పరీక్షను రాసిన ఎనిమిది మందిలో ముగ్గురు మాత్రమే పాస్ అయ్యారు. ఐదుగురు పాస్ కాలేదని గ్రామస్థులు ప్రకటించారు. అయితే మరో పరీక్షను నిర్వహించి అభ్యర్థిని నిర్ణయిస్తామని గ్రామస్థులు వెల్లడించారు. గ్రామస్థులు అభ్యర్థుల గొప్ప గొప్ప వాగ్దానాలు విని విసిగిపోయారని, వారు తమ నాయకుడిగా అర్హత సాధిస్తారో లేదో పరీక్షించాలని నిర్ణయించుకున్నారని గ్రామానికి చెందిన యువకులు చెప్పారు. అలాగే ఇది ఆరోగ్యకరమైన సంకేతమని సుందర్‌ఘర్ జిల్లా కలెక్టర్ నిఖిల్ పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. అయితే
from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/4VG7ETv
0 Comments