నోబెల్ శాంతి పురస్కారం.. నార్వేకు చైనా వార్నింగ్

ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన చైనా.. సొంత ప్రయోనాలే లక్ష్యంగా ముందుకెళ్తోంది. ఓవైపు భారత్‌తో సరిహద్దు వివాదం, దక్షిణ సముద్రంలో దూకుడు, జపాన్‌తో దీవుల విషయంలో గొడవ పడుతోంది. హాంగ్‌కాంగ్‌‌ను మొత్తం తన నియంత్రణలోకి తెచ్చుకోవడం కోసం ‘నేషనల్ సెక్యూరిటీ లా‌’కు చైనా ఆమోదం తెలపడం.. దాన్ని వ్యతిరేకిస్తూ హాంగ్‌కాంగ్ వాసులు ఆందోళనలకు దిగడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే డ్రాగన్ నార్వేకు వార్నింగ్ ఇచ్చింది. చైనా తీసుకొచ్చే ఏకపక్ష చట్టలాకు వ్యతిరేకంగా హాంగ్ కాంగ్ వాసులు పోరాటం చేస్తున్నారు. ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారం రేసులో హాంగ్ కాంగ్ పోరాట యోధులు ముందున్నారు. వారికి నోబెల్ శాంతి పురస్కారం దక్కడమంటే.. అది తమకు వ్యతిరేకంగా వ్యవహరించడమేననే భావనలో చైనా ఉంది. దీంతో వారికి నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వొద్దని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ నార్వేను హెచ్చరించారు. ప్రస్తుతం యూరప్ పర్యటనలో ఉన్న వాంగ్.. వెళ్లి మరీ హెచ్చరించడం గమనార్హం. చైనా, అమెరికా మధ్య సంబంధాలు తీవ్రంగా క్షీణించిన నేపథ్యంలో.. యూరప్ దేశాల మద్దతు కోసం చైనా విదేశాంగ మంత్రి ప్రయత్నిస్తున్నారు. నార్వే విదేశాంగ మంత్రితో వాంగ్ చర్చలు జరిపి బయటకు వచ్చిన తర్వాత.. భవిష్యత్తులో నోబెల్ శాంతి బహుమతిని హాంగ్‌కాంగ్ ఆందోళనకారులకు ఇస్తే మీ స్పందన ఏంటని మీడియా ప్రశ్నించింది. దీనికి ఆయన బదులిస్తూ.. గతంలో కావచ్చు.. వర్తమానం లేదా భవిష్యత్తులో కావచ్చు.. నోబెల్ శాంతి పురస్కారం పేరిట మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తే.. చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తుందని వాంగ్ బదులిచ్చారు. ఇరు దేశాలు పరస్పర గౌరవంతో.. ఒకరినొకరు సమానంగా పరిగణిస్తూ ముందుకెళ్లినంత కాలం ద్వైపాక్షిక సంబంధాలు మరింతగా ముందుకెళ్తాయని వాంగ్ వ్యాఖ్యానించడం గమనార్హం. చైనా అసమ్మతి నేత లియూకు నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వడంతో డ్రాగన్ చైనాతో సంబంధాలను నిలిపేసింది. దలైలామాకు నోబెల్ శాంతి పురస్కారం ప్రకటించినప్పుడు కూడా ఇలాగే వ్యవహరించింది. చైనా విదేశాంగ మంత్రి నార్వేలో పర్యటించడం 15 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2QElljb

Post a Comment

0 Comments